వరద ముంపు బాధితులకి 500 ఆహార పొట్లాలను పంచిన రాజోలు జనసైనికులు
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం రామరాజులంక కి చెందిన మేడిచర్ల రాము గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరుపున వరదముంపు బాధితులకు 500 పైగా ఆహార పొ ట్లాలను పంపిణీ చేయడం జరిగింది. మేడిచర్ల రాము మాట్లాడుతూ గత వారం రోజులుగా లంకప్రాంత ప్రజలు జలదిగ్భందం లో ఉన్నారని, వారికి కనీస అవసరాలైన త్రాగునీరు, నిత్యావసర సరుకులు, పాలు, కరెంట్, పశువులకు దాణా లేక అనేక అవస్థలు పడుతున్నారని, అక్కడ ప్రజలు వారికి కనీస అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చలేకపోయిందని, గత వారం రోజులుగా అంధకారం లో ఉన్నామని, కనీసం పసిపిల్లలకు పాలు లేక అనేక సమస్యలు ఎదుర్కొన్నామని వాపోయారని ఆ వరద బాధిత కుటుంబాలు అన్నాయి. రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే స్పందించి, వారికి తగిన న్యాయం చెయ్యాలని, పంట నష్ట పోయిన వారికి ఆర్థిక సాయం చేయాలని, వరద ప్రభావిత ప్రాంత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రెండు వేలరూపాయలు సరిపోదని, ప్రతి కుటుంబానికి కనీసం పదివేలు ఆర్థిక సహాయం చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మేడిచర్ల సతీష్ , మేడిచర్ల అయ్యప్ప , కాకర శ్రీను తదితరులు పాల్గొన్నారు.