శ్రీకాళహస్తి ( జనస్వరం ) : పురపాలక సంఘం పరిధిలోని రాజీవ్ నగర్ అక్రమాలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరపాలని జనసేన నియోజకవర్గం ఇన్ ఛార్జి వినుత కోటా డిమాండు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాజీవ్ నగర్ అక్రమాల్లో కీలకపాత్ర పోషించింది వైసీపీ, నేతలే అని ఆమె ఆరోపించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వైసీపీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని రాజీవ్ నగర్ కు చెందిన ఇళ్లప పట్టాలు ప౦పిణీ చేస్తున్నారని ఆమె చెప్పారు. ఈ విషయం అధికారులకు తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని వినుత కోటా ప్రశ్నించారు. చిన్న ఉద్యోగుల ఇళ్లు కాకుండా అధికారులకు ధైర్యం ఉంటే వైసీపీ కార్యాలయం తనిఖీ చేయాలని ఆమె డిమాండు చేశారు. రాజీవ్ నగర్ ఇళ్ల పట్టాల అక్రమ వ్యాపారం విషయంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి ప్రత్యక్షహస్తం ఉందన్నారు. ఎమ్మెల్యేకు ఒక్కొక్క పట్టాకు రూ. నుంచి రూ. 8లక్షల వరకు లబ్ది చేకూరుతోందన్నారు. ఎంతో కాలంగా శ్రీకాళహస్తి వైసీపీ కార్యాలయం కేంద్రంగా. రాజీవ్ నగర్ ఇళ్ల పట్టాలు అక్రమంగా విక్రయం జరుగుతున్న అధికారులు ఇంతకాలం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. రాజీవ్ నగర్ లో రూ.వందల కోట్లు అవినీతి జరిగిందన్నారు. ఇంత పెద్ద అవినీతిలో అసలు సూత్రధారులను వదలి కేవలం చిరు ఉద్యోగులను బలి పశువులు చేయడం అన్యాయమన్నారు. రాజీవ్ నగర్ లో విద్యుత్ కనెక్షన్ కు రూ.20వేలు, ఇంటి పన్నుకు రూ.50వేలు వంతున వసూలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమన్నారు. శ్రీకాళహస్తితో పాటు రేణిగుంట, తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లో ప్రభుత్వ ఇళ్ల స్ట స్థలాలు అమ్మకానికి పెట్టి వైసీపీ వ్యాపారం చేస్తోందన్నారు. క్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నాఈ నాలుగు మండలాల్లో జరిగిన ఇళ్ల స్థలాల అక్రమాలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ చేయించాలన్ వినుతకోటా డిమాండు చేశారు. జనసేన అధికారంలోకి వస్తే రాజీవ్ నగర్ తో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఇళ్లకేటాయింపులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని వినుత కోటా హామీ ఇచ్చారు.