పత్తికొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు గారు కర్నూల్ లో వీరమహిళ, జనసేన కార్యకర్తల సమీక్ష సమావేశం ఈనెల 21న శనివారం ఉదయం 10:00 గంటలకు పరిణయ ఫంక్షన్ హాల్, మౌర్య ఇన్ కర్నూల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గం పార్టీ బలోపేతమే లక్ష్యంగా నియోజకవర్గ, మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు దిశగా సమావేశం నిర్వహిస్తున్నారు. కావున పత్తికొండ నియోజకవర్గ జనసేన నాయకులు వీరమహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పత్తికొండ నియోజకవర్గం నాయకులు సీజీ రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, ధర్మతేజ, చాంద్ బాషా, వడ్డే వీరేష్, జీవన్, మరియు తదితరులు తరపున పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com