
● నినాదాలు చేస్తున్న జనసేన కార్యకర్తలు
రాజంపేట, (జనస్వరం) : రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు రాజంపేట జనసేన నాయకురాలు పోలిశెట్టి రజిత ఆధ్వర్యంలో జనసేన నాయకులు రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అనే నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకురాలు పోలిశెట్టి రజిత మాట్లాడుతూ జిల్లాల విభజనతో రాజంపేటకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఏ వనరులు లేకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎలా చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి సౌకర్యాలు లేని రాయచోటి జిల్లా కేంద్రంగా ప్రకటించడం అన్యాయమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేసి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య,పోలిశెట్టి రమణయ్య, సుబ్బరాయుడు, కిషోర్, విజయ, లక్ష్మి దేవి, జయంతి, జానకి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.