రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలి: సంయుక్త కార్యాచరణ కమిటీకి సంఘీభావముగా ఈ రోజు దీక్షలో జనసేన పార్టీ
ఈరోజు రాజంపేట పట్టణంలో రాజంపేట జిల్లా సాధన సమితి వారి ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష లో జనసేన పార్టీ ఇంచార్జ్ వెంకటరమణ గారి ఆధ్వర్యంలోజనసైనికులు, వీర మహిళలు, బండ్ల రాజేష్ ,సాయి కృష్ణ, ఉద్దండ వెంకటేష్ , తొండపునాటి రాజేష్, మరియు రజిత, గన్నె మస్తాన్ పాల్గొన్నారు. పార్లమెంటరీ స్థాయిలను జిల్లాగా ప్రకటిస్తామని చెప్పినందున, మొదటి నుండి పార్లమెంటుగా ఉన్న రాజంపేటను జిల్లాగా చేసి తీరాలని , మీ రాజకీయ నాయకుల స్వార్ధానికి కి రాజంపేటను బలిచేయొద్దని జనసేన పార్టీ కోరుకుంటుంది. జిల్లాగా ప్రకటించి రాజంపేట అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము అన్నారు. అన్నమయ్య జిల్లా పేరు పెట్టి పదకవితా పితామహున్ని గౌరవించాలని కోరుకుంటున్నాము అన్నారు. ఈరోజు దీక్షలో పాల్గొన్న రాజంపేట మండల జనసేన కార్యకర్తలు బండ్ల రాజేష్, సాయి కృష్ణ, ఉద్దండ వెంకటేష్, తొండపునాటి రాజేష్, రజిత, గన్నె మస్తాన్ లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.