రాజంపేట ( జనస్వరం ) : మార్కెట్ యార్డ్ లో స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించిన జనసేనపార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ లేక చెత్త డబ్ యార్డ్ అనే విదంగా ఉన్న రాజంపేట పురపాలక పరిధిలోని మార్కెట్ యార్డ్, కొన్నేళ్లుగా మురుగు నీరు, కుళ్ళిపోయిన చెత్త వల్ల దోమల బెడదతో ఇలాంటి తీవ్ర సమస్యలతో చుట్టుపక్కల నుంచి వచ్చిన రైతులు బాధపడుతున్నారన్నారు. పన్నులు కట్టించుకోవడంలో ఉన్న శ్రద్ద వాళ్ళకి సమస్యలు తీర్చడంలో శ్రద్ద చూపించక పోవడం చాలా బాధాకరమని అన్నారు. దీని మీద పలుమార్లు మున్సిపల్ కమిషనర్ కి పురపాలక శాఖ అధికారుల దృష్టికి పిర్యాదులు చేసిన ఉపయోగం లేకపోయిందంటూ.. దోమల కాటువలన పలు రకాల జబ్బుల బారిన పడి సంపాదనకంటే హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అని మార్కెట్ లోని కూలీలు వ్యాపారాస్తులు తెలియచేసారు. నియోజకవర్గంలో అతిపెద్ద మార్కెట్ కావడంతో స్థానిక మరియు చుట్టుపక్కల నుండి ప్రజలు అధిక సంఖ్యలో సరుకులు కొనుగోలు చేయడానికి వెళ్తుంటారు. అదేవిధంగా నలుమూలల దూరప్రాంతాల నుంచి రైతులు ఇక్కడే కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు. ఇప్పటికైనా ఈ సమస్యలకి పరిష్కారం చూపాలని జనసేన సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్, కోలాటం హరికృష్ణ, సూరి, హరి, అబ్బిగారి గోపాల్, వెంకటయ్య, నగరాజ, సిద్దయ్య, జనసైనికులు, స్థానికులు, రైతులు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com