రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో అసంబ్లీ ఇంచార్జ్ గారి నేతృత్వంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి ముఖరం చాంద్ మరియు సీనియర్ నాయకుడు రామ శ్రీనివాస్ హాజరై వైసీపీ నేతలు జోగి రమేష్ అంబటి రాంబాబు కొరముట్ల శ్రీనివాసులు రోజా గార్లపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజా నీకు నగిరి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో సీటు వస్తాదో రాదో కూడా తెలియని నీకు మా అధ్యక్షులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత స్థాయి నీకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వైసిపి నేతలు కొరముట్ల శ్రీనివాసులు గారికి అంబటి రాంబాబు గారికి జోగి రమేష్ లకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిపై విమర్శించే స్థాయి అర్హత లేదని మీరెంత మీ బతుకులెంత అని ఫైర్ అయ్యారు ప్రజాగ్రహాం ముందర దహించుకు పోతారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉన్న సమయభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ యువనాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర పంతులు, వెంకటయ్య, గోపి, చౌడయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com