రాజంపేట, (జనస్వరం) : జనసేన పార్టీ రాజంపేట తరపున ట్రూ అప్ ఛార్జీల పేరిట విద్యుత్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడం సామాన్యుడికి కరెంటు షాక్ లాంటిది. కరోనా తరువాత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకి 2020లో ఇప్పటికి రెండుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 2021 మార్చిలో ఏప్రిల్ ఫిక్స్డ్ ఛార్జెస్ అని మళ్లీ ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల అని వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం వసూలు చేయడం ఈ ఆర్ సి నిబంధనలకు నిరంతరం విద్యుత్ ఛార్జీల పెంచటం అసమర్థ పరిపాలనకు నిదర్శనం, విద్యుత్ ఛార్జీలను పెంచమని నినాదంతో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ నేడు విచ్చలవిడిగా విద్యుత్ ఛార్జీలను పెంచడం సరైంది కాదు. విండ్ పవర్ సోలార్ పవర్ వచ్చిన తర్వాత విద్యుత్ తయారీ ధరలు భారీగా తగ్గిన తరుణంలో ముందున్న పి పీ ఏ లను రద్దుచేసి కమీషన్ల కోసం అధిక ధరలతో విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై భారం మోపడం, డిస్కాంలలో వచ్చే నష్టాలను కేంద్ర ప్రభుత్వం నిధిని ఏర్పాటు చేసి తిరిగి ఇస్తున్నా లక్షల కోట్ల అప్పు చేసి దానిని ప్రజలపై భారం మోపటం అవినీతి కి పరాకాష్ట, రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి ధరల నియంత్రణ జరగాలి కానీ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న సామాన్యులకి నిత్యావసరాల అభివృద్ధి మోయలేని భారంగా ఉంటోంది. అలాగే వాడకం పైన మాత్రమే కాకుండా, కెపాసిటీ పైన సర్ ఛార్జీలు ఫిక్స్డ్ ఛార్జిలు, ట్రూ అప్ ఛార్జెస్ పేరిట నిరంతరం జరిగే దోపిడీ ఆపేయాలి. ప్రజలపై భారం పెంచే ప్రతిపాదనలను వెనక్కు తీసుకోవాలని జనసేన పార్టీ రాజంపేట తరఫున డిమాండ్ చేస్తున్నామని రాజంపేట జనసేన నాయకులు బాల సాయి కృష్ణ గారు మీడియాతో చెప్పారు. అంతే కాకుండా రైతులకు బకాయిలుగా ఉన్న బిల్లులన్నీ తక్షణమే క్లియర్ చేయాలి మరియు సామాన్య కూలీలకు పెండింగ్ బకాయిలు చెల్లించి కూలీల వేతనాలు నిర్ణీత సమయంలో వారికి అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై జనసేన పార్టీ నిరంతరం తన గళం వినిపిస్తుంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై మండలం కరెంట్ ఆఫీస్ లో డివిజనల్ అధికారికి వినతి పత్రం అందజేస్తున్న మని అలాగే అన్ని మండలాల్లో కూడా జనసేన నాయకులు చేస్తున్నారని జనసేన పార్టీ కడప జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కత్తి సుబ్బరాయుడు గారు చెప్పారు. అలాగే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బండ్ల రాజేష్, రాష్ట్ర చేనేత సంఘం కార్యదర్శి రాటాల రామయ్య, తాళ్లపాక శంకరయ్య, పీ. శ్రీనివాసులు, హరి, నంద్యాల రహంతుల్లా, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com