రాజంపేట, (జనస్వరం) : తిరుపతి కడప హైవేలో నిన్న జరిగిన లారీ, బస్సు రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను రాజంపేట జనసేనపార్టీ నాయకులు అతికారి దినేష్ పరామర్శించి పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు, పౌష్టికాహారం, కిట్లను అందజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన రాజంపేట నియోజకవర్గ జనసైనికుడు ఏనుగుల మల్లి తండ్రి గారైన ఏనుగుల శంకరయ్య తీవ్రంగా గాయపడడంతో అతని కుటుంబ సభ్యులకు 10,000/- రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అలాగే సిద్దవటం మండలానికి చెందిన బస్సు కండక్టర్ బాల వెంకటేష్ కూడా తీవ్రంగా గాయపడి ఐసియులో ఉన్నారు. అతని కుటుంబ సభ్యులకి కూడా 10,000/- రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా కాపునాడు అధ్యక్షులు సింగనమల శ్రీనివాసులు, హేమంత్, అండ్రు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com