రైల్వే కోడూరు, (జనస్వరం) : రైల్వే కోడూర్ నియోజకవర్గంలో వి.వి .కండ్రిక పంచాయతీలోని "వినాయక నగర్" అనబడే ముప్పై కుటుంబాల గిరిజన గ్రామం కోడూరు పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆధునిక ఆధునిక నాగరికతకు, సమాజానికి దూరంగా వెలసినట్టు ఉండే ఈ గ్రామంలో ఎటు చూసిన గుడిసెలు తడికెలుతో దర్శనమిస్తుంది. గత మరియు ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురికాబడి సరైన మౌలిక సదుపాయాలు లేక వీటిపై పదే పదే సంబంధిత నాయకులు ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకొని వెళ్లిన ప్రయోజనం లేకపోయింది అని నిస్సహాయులుగా మిగిలిపోయి ఉన్నాం అని జనసేన నాయకులకు తమ గోడునీ వెళ్ళబుచ్చారు. తమ సమస్యలను అధిగమించాలంటే తక్షణమే ప్రభుత్వం ఆ గ్రామానికి ప్రాథమిక మౌళిక సదుపాయాలు కల్పించాలని, ముఖ్యంగా అక్కడ ఆధార్ కార్డులు లేని అనేకమంది చిన్నారులు చదువులకి దూరంగా, ప్రభుత్వం ఇచ్చే అమ్మఒడి పథకానికి అనర్హులుగా, ప్రాధమిక ఆరోగ్య పరీక్షలును ప్రభుత్వ ఆసుపత్రిలో చేపించుకోవాలన్న, అంగన్ వాడి కేంద్రాలలో ఆధార్ లేక పోషక విలువలు కలిగిన ఆహారంనీ తీసుకోవాలన్న, సిక్కోలు పార్వతి అనే మహిళ గర్భవతిగా చాలా ఇబ్బందులకు గురైతుంది. 65 సంవత్సరాల శనగ ఈశ్వరయ్యకు వృధ్యాప పింఛన్ లేక, ఒక కాలుని కోల్పోయిన గిలకపాటి.శివ అనే వికలాంగుడుకి పింఛన్ లేక ఏదైనా ఆ గ్రామంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతే రవాణా లేక, ఉన్న మట్టిరోడ్డు గతుకులు గుంతలమయై వేసిన త్రాగునీటి బోరు నుంచి సరిగ్గా నీరు రాక గ్రామప్రజలు అనేక కష్టాల సమ్యల సుగుండంలో చిక్కుకొని ఉన్నారు. అని, మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీ పక్షాన నిలిచి మీ సమస్యకు పరిష్కారం దిశగా పోరాడి మీకు మంచి చేస్తాం అని జనసేన నాయకులు హామీ ఇచ్చినట్టు పత్రికాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మర్రిరెడ్డి ప్రసాద్, ఉత్తరాది.శివకుమార్, మహేష్. నగిరిపాటి, సిరియల. శివకుమార్, పురుషోత్తం మరియు శ్రీరాములు తదితురులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com