● బాధితులను ఆర్థికంగా ఆదుకోవాలి
● దుర్గాడ గ్రామంలో వర్షానికి కూలిన ఇళ్ల సందర్శనలో జనసేన పార్టీ ఇంచార్జ్ మాకీనీడి శేషుకుమారి డిమాండ్
గొల్లప్రోలు, (జనస్వరం) : కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో అకాలంగా కురిసిన వానకు గ్రామంలో 35 గృహలు పైకప్పు కూలిపోవడంతో బాధితులకు నివాసాలు లేక రోడ్డునపడ్డారు. స్థానిక జనసైనికులు ద్వారా విషయం తెలుసుకుని జనసేన పార్టీ పిఠాపురంనియోజకవర్గ ఇన్ చార్జ్ మాకినీడి శేషుకుమారి గ్రామానికి చేరుకుని కూలిన ఇళ్లను సందర్శించి బాధితులను పరామర్శించారు. బాధితులకు మనోధైర్యాన్ని నింపారు. ఈ సంఘటన ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. దుర్గాడ గ్రామంలో ఇండ్లు కోల్పోయిన ప్రతీఒక్కరిని ప్రభుత్వం ఆదుకోవాలని, వర్షం వలన కూలిపోయిన ఈ ఇండ్లను తక్షణమే నిర్మించి ఇవ్వాలి. సామాన్లు పాడై దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఆర్దిక సహాయం అందించాలి. అధికారులు వచ్చి వెళ్ళడంకాక వారి సహాసహకారాలు వెంటనే అందేలా చూడాలని అధికారులను కోరారు. అదేవిధంగా శాసనసభ్యలు పెండెం దొరబాబు, పార్లమెంట్ సభ్యులు వంగాగీత గ్రామ పర్యాటన చేసి బాధితులకు అండగా నిలిచి వారికి లబ్ది చేకూర్చాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేసారు. అలాగే గ్రామంలో జనసైనికులు ఇలాంటి సంఘటనపై స్పీడుగా స్పదించి ఇలాంటి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ప్రతీ పేదవాడి కల నెరవేరుస్తారని ఆ దిశగా పనిచేయాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గంగ, గొల్లపల్లి దొరబాబు, కాపరపు వెంకటరమణ, మొగలి శ్రీనివాస్, శేఖ సురేష్, వాట్టూరి శ్రీను, గొల్లపల్లి శ్రీను, బండి అప్పారావు, ఉమ్మిడి శివ, గొల్లపల్లి గంగాధర్, పెనుగొండ వెంకటేశ్వరావు, కరినేది కృసరాజు, గొల్లపల్లి శ్రీనివాస్, వెలుగుల లక్ష్మణ్,పెనుగొండ సోమేశ్వరావు, పుణ్యవంతులు మూర్తి, కసిరెడ్డి నాగేశ్వరరావు, మేళం బాబి, పబ్బినీడి దుర్గాప్రసాద్ జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.