
రైల్వేకోడూరు, (జనస్వరం) : రైల్వేకోడూరు నియోజకవర్గంలోని రైల్వేకోడూరులో జనసేన పార్టీ కార్యకర్తల క్రియాశీలక సమావేశం జనసేన పార్టీ నేత గంధంశెట్టి దినకర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఆడిటర్ గంధంశెట్టి దినకర్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పైన ప్రజలు అవిశ్వాసం గణనీయంగా పెరుగుతుందన్నారు. కారణం చాలా విషయాలలో ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన భరోసా ఇవ్వకపోవడమేనని ఆన్నారు. రాజధాని విషయం, రాష్ట్ర అప్పుల అంశాలు, పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం, నిత్యావసరాల ధరల కట్టడి చేయకపోవడం, అధికంగా పెరిగిన ఇసుక ధరలు, మద్యం ధరలు, పెట్రోలు ఉత్పత్తుల ధరలు అంతేకాకుండా గృహ నిర్మాణం మరియు మహిళలపై, దళితులపై తీవ్రమైన దాడులతో పాటు రాష్ట్రం మొత్తం మీద అస్తవ్యస్తంగా గుంతలతో మరియు గోతులతో తయారైన రోడ్ల పరిస్థితులు దీనికి కారణాలుగా వివరించారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు కూడా ప్రజల ఆకాంక్షను పార్లమెంటులో వినిపించడం చేయడం లేదు అన్నారు. వేల కోట్ల అప్పులు తెస్తున్నా, సంక్షేమం సరైన దిశలో లేదు అన్నారు. కాపుల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, బీసీ వర్గాలు ప్రభుత్వానికి దూరమయ్యాయన్నారు. ఉద్యోగులు, పెన్షన్ దారులలో ఒకటో తేదీ టేన్షన్లు తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయని, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులలో ఉన్నారని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి, రోడ్లు, గృహనిర్మాణం పాతాళానికి చేరాయని, ప్రభుత్వం మిగిలిన రెండున్నర సంవత్సర కాలంలోనైనా ప్రణాళికాబద్ధంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయగలిగితే ప్రజలలో అసంతృప్తి, అవిశ్వాసం తగ్గుతుందనే విషయం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు నెల 2వ తేదీన జరగబోయే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు పైన సమావేశం లో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మెక్కంటి హరి, మాదం సుబ్రహ్మణ్యం, మందపాటి మహేష్, పెయ్యల మారయ్య, మోదేపల్లి రోహిత్ తదితరులు పాల్గొన్నారు.