ప్రపంచ విపత్తు సంభవించినా కరోనా ఉధృతి దృష్ట్యా, ప్రాణాలు కాపాడటానికి ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం ఒక సంజీవినిగా చెప్పుకోవచ్చు రైల్వే కోడూరు జనసేన నాయకులు మర్రి రెడ్డిప్రసాద్ గారు అన్నారు. రైల్వే కోడూరు నుండి కరోనా రోగులు తిరుపతి నెల్లూరు పరిసర దూరప్రాంతాలకు వైద్యం కోసం వెళ్లాల్సి వస్తే చాలా శ్రమతో కూడుకున్న పని అన్నారు . కావున ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి ముందుకు రావాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం జరిగితే నియోజకవర్గంలో కరోనా రోగులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని అన్నారు. అందరినీ ఒకే దృష్టితో చూసి వ్యాక్సిన్ సరఫరా చేయాలని, అంతేకాకుండా తక్కువ మందికి వ్యాక్సిన్ అందచేయడం వలన పరిస్థితి మన అదుపులో ఉండదు కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ సరఫరా చేయాలని, వ్యాక్సిన్ సరఫరాలో ఎటువంటి స్వార్ధపూరిత రాజకీయాలు చేయరాదని ఈ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరపున హెచ్చరించడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎం ల పాత్ర చాలా ముఖ్యమైనది అని, తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com