గోమాతలను రక్షించండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన రైల్వే కోడూరు జనసైనికులు
రైల్వేకోడూరు పట్టణ పరిధిలోని స్థానిక కోడూరు ఎస్ఐ రెడ్డి సురేష్ కు గోమాతలను రక్షించండి అంటూ రైల్వేకోడూరు జనసేన పార్టీ నాయకులు మర్రి రెడ్డి ప్రసాద్, నగిరిపాటి మహేష్, హేమంత్ లు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై జనసేన నాయకులు మాట్లాడుతూ రైల్వే కోడూరుకి బైపాస్ రోడ్డు లేకపోవడం వాహనాలు అన్ని పట్టణ పరిధిలో నుంచే వెళ్తూ ఉంటాయని, ఈ క్రమంలో గోమాతలు రాత్రిపూట రోడ్లల లో సంచరిస్తూ ఉంటాయని, అలాగే రోడ్డుపైనే పండుకుంటాయని, రహదారులకు అడ్డంగా ఉండటంతో కొంత మంది వాహనచోదకులు గమనించకుండా ఢీ కొట్టి వెళ్లిపోతుంటారు. గోమాతల సంరక్షణ యజమానులు చూసుకోలేక వాటిని రోడ్లపైకి వదిలేయడంతో ఈ విధమైనటువంటి ప్రమాదాలు అనునిత్యం జరుగుతూనే ఉన్నాయని, ఇలా ప్రమాదాల బారిన పడకుండా వాటి సంరక్షణ యజమానులే చూసుకునే విధంగా పోలీసు వారు యజమానులను పిలిపించి వారికి తెలియపరచ వలసిందిగా, గోమాతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే విధంగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్ఐ రెడ్డి సురేష్ కు ఫిర్యాదు చేసినట్లు జనసేన నాయకులు తెలియజేశారు.