Logo
Date of Publish : 25 November 2021, 1:55 am
Editor : Sake Naresh

వరద బాధితులకు తన వంతు సహాయం అందిస్తున్న రైల్వేకోడూరు జనసేన పార్టీ నాయకులు

    రైల్వేకోడూరు, (జనస్వరం) :   గతవారం కురిసిన భారీ వర్షాల కారణంగా రాజంపేట నియోజకవర్గం నుంచి అన్నమయ్య డ్యామ్ కట్టలు తెగిపోవడంతో దాదాపు కింద ఉన్నటువంటి పల్లెలు పులపత్తూరు, మందపల్లి, నీలపల్లి తోగురు పేట, ఆ చుట్టూ ఉన్నటువంటి దాదాపు 10 పల్లెలు నీట మునగడం జరిగింది. ఆ వరదల కారణంగా దాదాపు వందల మంది ప్రాణాలు పోగొట్టుకోవడం దాదాపు వందల ఎకరాలు నష్టపోవడం చాలా మంది తన ఇల్లుల పోగొట్టుకొని చాలా మంది నిరాశ్రయులు అవ్వడం జరిగింది. వరదల్లో నిరాశ్రయులు అయినటువంటి వారిని పరామర్శించి వాళ్ళకి తనవంతు సహాయంగా స్వచ్ఛందంగా రైల్వే కోడూర్ పగడాల పల్లి గ్రామానికి చెందిన ముత్యాల బాబు, అంకి పల్లి సత్యనారాయణ, నల్లంశెట్టి చంగల్ రాయులు మరియు జనసేన పార్టీ నాయకులను అంకిపల్లి అఖిల్ కళ్యాణ్ మందపల్లి, నీలిపల్లి, పుల్ల పుత్తూరు వెళ్లి అక్కడ వారిని పరామర్శించి వారికి కావాల్సినటువంటి దుప్పట్లు, చీరలు మరియు పలువురికి నిత్యావసర సరుకులు, ఇల్లు కొట్టుకుపోయిన ఐదు కుటుంబాలకు తలుపులు ఇవ్వడం జరిగింది  అదే విధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రైల్వేకోడూరు పగడాల పల్లి గ్రామస్తులకు ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా అక్కడ వారు పడుతున్న ఇబ్బందులు చాలా బాధాకరంగా ఉంది. దయచేసి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలులోని ప్రజలకు ప్రతి ఒక్కరూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో నవీన్, కిరణ్, శ్రీకాంత్ మరియు పలువురు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com