
రైల్వేకోడూరు, (జనస్వరం) : కడపజిల్లా రైల్వే కోడూరు నియోజక వర్గం పుల్లంపేట మండలం రెడ్డిపల్లే గ్రామంలో ఉండే జనసైనికుడు పుల్లయగారి గణేష్ భార్య లలితకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు ఆ కుటుంబానికి, రెడ్డిపల్లి గ్రామ జనసైనికులు, పల్లంపేట జనసేన సేవాదళ్ మరియు NRI జనసేన నాయకులు అందరూ కలిపి 3’30,000 రూపాయలు పుల్లంపేట మండల జనసేన నాయకులు మొదటి నుంచి ఈ విషయాన్ని సమన్వయ పరచిన కటికంమణి ద్వారా బాధితురాలకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన గుర్తుకు రావాలి అని మా అధ్యక్షులు వారు అన్న మాటలకు ఈ సహాయమే ఉదాహరణని పుల్లయగారి గణేష్ భార్య లలిత గారికి అన్నివేళలా తోడుగా జనసేన పార్టీ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం సోదరి ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉంది అని అన్నారు. గణేష్ మాట్లాడుతూ తన భార్య ఆరోగ్య విషయంలో నాయకులు, జనసైనికులు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించిన వారికి పేరు పేరునా రైల్వేకోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ ద్వారా ధన్యవాదములు తెలుపుతున్నామని అన్నారు.