Logo
Date of Publish : 18 September 2021, 3:57 pm
Editor : Sake Naresh

విద్యుత్ ఛార్జీలు మరియు ఆస్తి పన్నుపెంపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రైల్వేకోడూరు జనసేన నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు

      రైల్వేకోడూరు, (జనస్వరం) : గృహ అవసరాల నిమిత్తం వినియోగిస్తున్న కరెంటు యూనిట్లు 300 లోపు ఉన్న కూడా A, B మరియు C కేటగిరీలుగా విడగొట్టి అర్ధం లేని ప్రమాణాలతో అధిక ధరలు ప్రజలపై విధించి వసూలు చేస్తున్నారని జనసేన పార్టీ రైల్వేకోడూరు నాయకులు ఆడిటర్ గంధంశెట్టి దినకర్ బాబు ఆరోపించారు. ఈ ఆలోచన తీరు బీపీల్ below powerty line క్రింద ఉన్న ప్రజలకు శారఘాతంగా మారిందని, అధిక శాతం పేద ప్రజలు దీనిపై సతమతమవుతున్నారు అని తెలిపారు. సాధారణ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో నీటి వసతి మునిసిపల్/పంచాయితీ వారు వీధి కుళాయిలు ద్వారా సరఫరా చేయాలి కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఉన్న వీధి నీటి కుళాయి కనెక్షన్లను తొలగించారు. దానికి అనుకూలంగా ఇంటికి నీటి కుళాయి కనెక్షన్లు తీసుకుని కరెంటు మోటార్ ద్వారా నీరుని వినియోగించే పరిస్థితులు కల్పించారు. దీని వల్ల కరెంటు యూనిట్ల వినియోగం బాగా పెరుగుతుందని వివరించారు. వేసవికాలంలో సాధారణంగా వేడి అధికంగా ఉంటుంది కనుక కూలర్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కూడా కరెంటు యూనిట్ల వినియోగం ఉంటుంది. ఇలా చెప్పుకుంటు పోతే చాలా సమస్యల వలయంలో మనకు తెలియకుండానే మనచుట్టు ఉన్న పరిస్థితులు మారిపోతున్నాయి. కాదు మార్చబడుతున్నాయి అంటే బాగుంటుందేమో అని అన్నారు. ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్ను విధించే మున్సిపల్ సవరణ చట్టం 44 ని, అలాగే జీవో నెంబర్ 198 ని రద్దు చేయాలని మరియు తక్షణమే వీటి అమలు పై రద్దు ప్రకటన చేయాలని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఇచ్చిన నోటిఫికేషన్స్ అమలు ప్రక్రియ నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు అన్నారు. ఆస్తి పన్ను పెంపుపై, కరెంటు సమస్యలుపై ప్రభుత్వం సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాలని కోరారు. ఆస్తి పన్ను పెంపుపై న్యాయస్థానాలను ఆశ్రయించినట్లు కరెంటు సమస్యల పైన కూడా న్యాయస్థానాలని ప్రజలు ఆశ్రయించే రోజులు ముందున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో మెక్కంటి హరి, మాదం సుబ్రమణ్యం, మహేష్, మారయ్య తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com