రైల్వే కోడూరు ( జనస్వరం ) : పుల్లంపేట మండలం నుండి బీసీ నాయకుడు, మండల వడ్డెర సంఘం అధ్యక్షుడు మరియు అనంతంపల్లి జెడ్.పి హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకట రమణ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారిని రాష్ట్ర కార్యదర్శితాతం శెట్టి నాగేంద్ర మరియు నియోజక వర్గ సీనియర్ నాయకులు పార్టీ కండువాలు కప్పి సగర్వంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు, బీసీలకు జనసేన పార్టీ, మరియు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారన్నారు. అద్యక్షుడు ఆదేశం మేరకు మిమ్మలని ముందు పెట్టీ మీవెనుక నడవడానికి సిద్ధమన్నారు. ఈ రోజు నుంచి మనమంతా జనసేన కుటుంబ సభ్యులమని, అన్ని విషయాల్లో ఐకమత్యంగా ముందు కెలదామని పిలుపు నిచ్చారు. పార్టీలో చేరిన నాయకుడు పసుపులేటి వెంకట రమణ మాట్లాడుతూ.. 30 ఏళ్ల రాజకీయ జీవితాన్ని చూశామని, నిజాయితి కలిగిన పవన్ కళ్యాణ్ వెంట నడచి ఆయన ఆశయ సాధనకు తోడుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వల్లేపు కటయ్య, శ్రీను, సుధాకర్, సిద్దార్థ్, హరీష్, సురేంద్ర, వెంకటరమణ, చలపతి, ధనుంజయ్, నాని, రమణ, రమేష్, మణి, శ్రీను, కోటకొండ శివ, పెద్దకృష్ణయ్య, మల్లికార్జున, సివచరణ, శ్రీను, గంపా ఖాసిం, సుధీర్, సతీష్, వెంకట రమణ, తురక పెంచలయ్య, పాన్యం ఎల్లయ్య, మణి, బత్తల సుధాకర్, వెంకటయ్య, సుదర్శన్, చిరంజీవి తదితరులు కండువా వేసుకుని త్వరలో బీసీ గర్జన పేరుతో ఒక సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ సీనియర్ నాయకులు జోగినేని మణి, పగడాల వెంకటేష్, నల్లం శెట్టి యనాదయ్య, ఆలం రమేష్, వరి కూటి నాగరాజ, ముద్ద పోలు రామసుబ్బయ్య, సర్పంచ్ కారుమంచి సంయుక్త, గంధం శెట్టి దినకర్ బాబు, పగడాల చంద్ర శేఖర్, కొండేటి వెంకట రమణ, ఆలం సుబ్బారాయుడు, గుగ్గిళ్ళ సుబ్బారాయుడు, పసుపులేటి రమణ, కొండేటి చంగయ్య, దాసరి వీరేంద్ర, యద్దల అనంత రాయలు, గోపి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com