Logo
Date of Publish : 21 October 2022, 3:05 pm
Editor : Sake Naresh

వైసీపీ నాయకులపై రాయచోటి జనసేన అసెంబ్లీ ఇన్చార్జ్ హసేన్ భాష ఫైర్

          రాయచోటి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు విమర్శించే స్థాయి మీకు లేదని జనసేన రాయచోటి అసెంబ్లీ ఇన్చార్జ్ హసేన్ బాషా హెచ్చరించారు. రాయిచోటిలోని అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాయచోటి అసెంబ్లీ ఇన్చార్జ్ హసేన్ బాషా మాట్లాడారు. నిజాయితీ గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ చేయనంత సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ చేస్తూ ఉందని ఇది చూసి అధికార వైసిపి పార్టీ నాయకులు జనసేన పార్టీపై బురద జల్లుతున్నారని అన్నారు. రాష్ట్రంలో గతంలో ఉన్న అప్పులు ఎంత ఇప్పుడున్న అప్పులు ఎంత అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామ శ్రీనివాసులు, రియాజ్, బాబ్జి, హసేన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com