
ఎమ్మిగనూరు ( జనస్వరం ) : ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు శునకాలు బెడద ఎక్కువైందని జనసేన పార్టీ నాయకులు రాహుల్ సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో రాహుల్ సాగర్ మాట్లాడుతూ పట్టణంలోని శివారు కాలనీ లైన మైనారిటీ కాలనీ, ఎస్సీ కాలనీ, శివన్న నగర్, సోమప్ప నగర్, సంజీవ నగర్, లాంటి అనేక కాలనీల్లో శునకాలు వాహనదారుల పైనా మరియు పట్టణ ప్రజలపై దాడి చేసి కరుస్తున్నాయని దింతో పట్టణ ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే భయాందోళనలకు గురౌతున్నారని కావున మునిసిపల్ అధికారులు వెంటనే స్పందించి శునకాలు పట్టుకొని అడవిలో వదలని డిమాండ్ చేశారు.