Logo
Date of Publish : 25 October 2022, 3:24 pm
Editor : Sake Naresh

మైలవరం మండలంలో జనసేనపార్టీ రచ్చబండ కార్యక్రమం

      మైలవరం, (జనస్వరం) : జనసేపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో గణపవరం, కీర్తిరాయినిగూడెం, టీ.గన్నవరం, చంద్రాల గ్రామపంచాయతీలలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేనపార్టీ రాష్ట్రఅధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామ్మోహన్ రావు(గాంధీ) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనపార్టీ గ్రామ గ్రామాన బలపడుతుందని, ప్రజలంతా ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన పార్టీకి ఓటు వేయాలని ఎదురుచూస్తున్నారని, 2024 ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యంగా మీరంతా మద్దతు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా తన సొంత కష్టార్జితాన్ని డబ్బును పలు సేవా కార్యక్రమాలు ఉపయోగించటం లేదని, అలాంటిది పవన్ కళ్యాణ్ కౌలు రైతులను దృష్టిలో ఉంచుకొని, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున 30 కోట్ల రూపాయలతో మూడు వేల మంది కౌలు రైతులు తన సొంత డబ్బులు ఇస్తున్నారని, ఇలాంటి నిజాయితీగల నాయకులను ప్రజలు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ జనసేనపార్టీ గ్రామస్థాయిలో బలపడుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామప్రజలు పలు సమస్యలను గాంధీ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేనపార్టీ మీకు అండగా ఉంటుందని, సమస్యలపైన పోరాటమే జనసేన ఎజెండా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ కృష్ణాజిల్లా సెక్రటరీ చింతల లక్ష్మి కుమారీ, మండల ప్రధాన కార్యదర్శి చంద్రాల మురళీకృష్ణ, మండల కార్యదర్శిలు తాళ్ల శివకృష్ణ, కూసుమంచి కిరణ్ కుమార్, స్థానికనాయకులు తోట మాధవరావు, నాగులూరి నారాయణరావు, దద్దనాల సత్యనారాయణ, చంద్రాల వెంకటేశ్వరరావు వీరమహిళ సామల సుజాత, యతిరాజుల ప్రవీణ్, k.వెంకటస్వామి, అక్కల సత్యనారాయణ, జనసైనికులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com