ఎమ్మిగనూరు ( జనస్వరం ) : గొనెగండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ముందు భాగంలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలు నాణ్యతతో నిర్మించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గానిగ బాషా, మాలిక్, మాట్లాడుతూ 2023 “సం” లో నాడు – నేడు క్రింద 53.95 లక్షల వ్యయంతో R&B నిధులతో చేపట్టిన వైద్యశాల మరమ్మత్తుల్లో నాసిరకపు పనులు చేశారని ప్రజా సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారుల విచారణలో మాత్రం పలితం కనపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాల ముందు భాగంలో నూతన భవనాల నిర్మాణం కోసం R&B నిధులతో పనులు జరగడంతో జనసేన పార్టీ కాంట్రాక్టర్లను అధికారులను కోరేది ఒక్కటేనని ప్రజల ఉపయోగం కోసం నిర్మించే భవనాల్లో గతంలో జరిగిన తప్పిదాలు పునరావృత్తం కాకుండా అధికారుల పర్యవేక్షణలోనే నాణ్యత కలిగేల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ వైద్య అధికారులు నాణ్యత ఉండేలా నిర్మాణపు పనులు జరగాలంటే తక్షణమే సమస్యను జిల్లా వైద్య అధికారుల దృష్టికి చేరేలా కృషిచేస్తే వారి ద్వారానే R&B అధికారులు ఎప్పటికప్పుడు జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించేలా చర్యలు తీసుకునే విధంగా కృషిచేయాలని గోనెగండ్ల ప్రభుత్వ వైద్య అధికారి కార్తిక్ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఖాసిం సాహెబ్, మునిస్వామి,మహమ్మద్ హుస్సేన్, సుబాన్, ఖాసిం, రవి కుమార్, దూద్ పీరా, ఇస్మాయిల్, ఆలి బాషా, రంగస్వామి, శ్రీరామ్, మైబుబ్ బాషా, పాల్గొన్నారు.