అధికారులు, నాయకుల నిర్లక్ష్యంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి కోనేరు అస్త్యవస్త్య౦ : లక్ష్మణ కుటాల

ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి

          కదిరి ( జనస్వరం ) : శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బృగు తీర్థాన్ని అధికారుల, నాయకుల నిర్లక్ష్యం కారణంగా శవాలు, కళేబరాలు, మురికి నీరు చేరి మురుగు కాలువలాగా మారిపోయిందని జనసేన జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ మురుగు నీటి వల్ల దోమలు, పురుగు పుట్రవల్ల అక్కడ నివసించే స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే 14.11.19 వ తేదీన స్వామి వారి బృగు తీర్థ అభివృద్ది పనులు ప్రారంభించి మూడు సంవత్సరాల కాలం గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళిన ప్రతిసారీ పూర్తి చేస్తాం అంటూ దాటవేత ధోరణితో కాలయాపన చేస్తున్నారు. కోనేరు అభివృద్ది కోసం కేటాయించిన 2.50 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఏమయ్యాయి అని స్థానికులు, భక్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అనుభవం లేని వారికి పుష్కరిణి అభివృద్ది పనులు అప్పగిస్తే వాళ్ళ ఇష్టానుసారం నాణ్యమైన పనులు చెయ్యకుండా అరకొర పనులు చేసి చేతులు దులుపుకోవాలని చూసిన తరుణంలో శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆగ్రహించిన విధంగా ఎన్నడూ లేని విధంగా కదిరి పట్టణంలో అకాల వర్షాలకు వరదలు వచ్చి కోనేరు మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం నిత్యం వేలసంఖ్యలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు గతంలో కోనేరులో స్థానం ఆచరించి దర్శనం కోసం వెళ్లేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం వల్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా మరొక 6 నెలల్లో శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవ్వనున్నాయి. అప్పుడు హడా విడి చేసే బదులు ముందుగానే కోనేరు అభివృద్ది పనులు పూర్తి చేస్తే కదిరి పట్టణ ప్రజలు, స్వామి వారి భక్తులు ఎంతో సంతోషిస్తారని కదిరి జనసేన పార్టీ తరపున తెలియజేసుకుంటున్నామని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way