- ఎమ్మెల్యే గారు ఆలయ రంగుల పై చూపించే శ్రద్ధ గూగూడు గ్రామ సమస్యలపై పెట్టండి
- ఏళ్ళ నాటి ఆచారాలను మార్చడానికి ప్రభుత్వాలకు హక్కెక్కడిది ??
- గూగూడు పర్యాటక కేంద్రంగా చేస్తామన్న హామీ ఏమైంది ?
- స్వామి వారి పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తున్న జనసేన నాయకులు వినోదం నారాయణస్వామి, గూగూడు సాకే రాజు, బాబు
నార్పల ( జనస్వరం ) : నార్పల మండల జనసేన పార్టీ మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ అద్యక్షతన, మండల నాయకులూ తుపాకుల భాస్కర్ ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో సింగనమల MLA జొన్నలగడ్డ పద్మావతి గారిపై జనసేన పార్టీ నాయకులూ గూగూడు పంచాయితీ జనసేన నాయకులు తీవ్ర స్థాయి విమర్శలు చేసారు . నాయకులు సాకే రాజు, నారాయణస్వామి మాట్లాడుతూ మతసామరస్యలకు ప్రతీకగా వెలుగొందుతున్న శ్రీ గూగూడు కుళ్లాయి స్వామి ఆలయ రంగుల మార్చడంపై MLA జొన్నలగడ్డ పద్మావతి గారికి ఉన్న శ్రద్ద గూగూడు గ్రామా సమస్యలపై పెడితే బాగుంటుందని అన్నారు. బ్రహ్మోత్సావాలకు వచ్చే భక్తులకు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాటికి పరిష్కారం చేయకుండా ఆలయ రంగులను మార్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యారు అని విమర్శించారు. దాదాపు 2. 50 లక్షలు ఆలయ నిధులు దుర్వినియోగం చేయడమే కాకుండా గత 100 సం. నుండి వస్తున్న ఆచారాలను తమ స్వార్థ ప్రయోజనాలకై ఇష్టారాజ్యాంగ ప్రవర్తిస్తూ భక్తి భావనలతో ఉండాల్సిన ఆలయ ప్రాంగణంలో గొడవల, దూషణలతో భయంకర వాతవరణాన్ని సృష్టించి భక్తుల మనోభావాలు దెబ్బ తీయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిచారు. మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్లు మాట్లాడుతూ దూరప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు సరైన వసతి, మహిళలకు స్నాన గదులు లేక కళ్యాణ్ కట్ట వద్దనే స్త్రీలు పురుషులు ఒకేచోట యిబ్బంది పడుతున్నారు. ఆలయ వసతి గదుల వద్ద ఆపరిశుభ్రత, వాటిలో సరైన సౌకర్యాలు కల్పిస్తే కొందరికైనా ఉపయోగపడుతాయి. ఏటా లక్షల్లో ఆదాయం వస్తున్నా వసతులు కల్పనలో జాప్యం ఎందుకని, గ్రామంలో చెత్త ఎక్కడికి అక్కడ పేరుకుపోయి రోడ్లు దుర్వాసన వస్తున్నాయి. ఎన్నికలముందు గూగూడు గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కేశారు. అలాగే ఆలయం వరకు రోడ్ విస్తరణ పనుల సంగతి ఏంటని ఎన్నికల సమయంలో హడావిడి తప్ప మల్లి వాటి సంగతే మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఇలా ఎన్నో సమస్యలని పక్కన పెట్టి అనవసర కార్యకలాపాలతో ప్రజలను వారి మనోభావాలను బెబ్బతీస్తు మరోసారి వైసీపీ ప్రభుత్వం రంగుల ప్రభుత్వం అని నిరూపించారు. మీకు చిత్త శుద్ధి ఉంటే ఆచారాలు, సంప్రదాయాలకు విలువ యిచ్చి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలని, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కచ్చితంగా భక్తుల మనోభావాలను గౌరవించి మతాలకతీతంగా ఉన్న రంగులు వేయించి మత సామరస్యానికి ప్రతికగా ఉన్న ఈ క్షేత్రం యొక్క పవిత్రతను, భక్తులు మనోభావాలకు విలువిస్తూ శ్రీ కుళ్ళాయి స్వామి వారిక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వినోదం లోకేష్, బాబు, నారాయణస్వామి గూగూడు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com