అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా 25వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 26వ డివిజన్ హమాలీ కాలనీలో పర్యటించి మహిళలతో మమేకమయ్యి ఇంటింటికి తిరుగుతూ స్థానిక సమస్యలు తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరంచేసి బటన్లు నొక్కడమే అభివృద్ధి అనుకుంటున్నాడని ఈ విధానం వల్ల రాష్ర్టంలో ప్రతి వస్తువు ధర పెరిగి రాష్ర్టంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడి మధ్యతరగతి ప్రజలు బ్రతుకులు వెళ్ళదీసేదే చాలా కష్టంగా ఉందని అన్నారు. జగన్ రెడ్డి నొక్కే బటన్ డబ్బులు సరైన పద్దతిలో లబ్ధిదారులకు పడడం లేదని... మేము అనంతపురం అర్బన్ నియోజక వర్గంలో మహిళలతో మాటామంతి కార్యక్రమం ద్వారా మహిళలని సమస్యలు అడుగుతుంటే ప్రతి ఒక్కరూ నిత్యవసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్నారనీ అన్నారు. దీనికి తోడు జగన్ పరిపాలన నియంత పోకడలకు పోయి ఎమ్మెల్యే లను రోబోలుగా తయారు చేసి నియోజక వర్గాల అభివృద్ధిని క్షీణింప చేశాడని దీనివల్ల ఏ డివిజన్, పంచాయితీలలోకి వెళ్లిన ప్రజలు తీవ్ర మౌలిక సదుపాయాల కొరతతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేస్తు స్థానిక డివిజన్ లో మురుగు కాలువలు, మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో జరగాలంటే జనసేన టిడిపి పార్టీలకు ఓటు వేసి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com