- వైఎస్ఆర్సీపీ కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి
సీతారామపురం, మార్చి 30 (జనస్వరం) : వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజలు, అధికారులు, సిబ్బంది తాగునీటి దాహార్తిని తీర్చేందుకు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి తన సొంత నిధుల నుంచి రూ.10,000 వెచ్చించి ప్యూరిఫైడ్ కూలింగ్ వాటర్ ఫిల్టర్‌ను విరాళంగా అందించి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బసిరెడ్డి కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు గాజులపల్లి రామ్మోహన్ రెడ్డి, బాలినేని పెద్దమాబయ్య, గుండ్లపల్లి తిరుపాలు, కలివెల సతీష్ కుమార్, ఎంపీడీవో శివప్రసాదరావు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.