Logo
Date of Publish : 15 December 2025, 1:34 pm
Editor : Sake Naresh

డిసెంబర్ 21 తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – వైద్యాధికారులు జాఫ్రీన్,మహమ్మద్ షాద్

ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం జయప్రదం చేయండి - వైద్యాధికారులు జాఫ్రీన్, మహమ్మద్ షాద్

క్రోసూరు,డిసెంబర్15.( జనస్వరం)

డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు పల్నాడు జిల్లా క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు జాఫ్రీన్, మహమ్మద్ షాద్ లు తెలిపారు సోమవారం పల్స్ పోలియో బ్యానర్ను ఆవిష్కరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని క్రోసూరు మండలంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.డిసెంబర్ 21 పోలియో దినం సందర్భంగా అప్పుడే పుట్టిన బిడ్డనుండి ఐదు సంవత్సరముల లోపు చిన్నారులకు బూత్ స్థాయిలో పోలియో చుక్కలను వేస్తారని, ఆరోజు పలు కారణాల వల్ల పోలియో చుక్కలు వేసుకోలేకపోయినా పిల్లలకు తిరిగి ఈనెల 22,23 వా తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో బృందాలు పోలియో చుక్కలు వేసింది లేనిది పరిశీలిస్తాయని వారు పేర్కొన్నారు భారతదేశం పోలియో రహిత దేశం అయినప్పటికీ మళ్లీ పోలియో రాకుండా ఉండేందుకు తగు ముందు జాగ్రత్తల్ని తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ క్రోసూరు మండలంలో గుర్తించిన పలు ప్రాంతాలలో అనగా మురికివాడలు, సంచార జాతులు, నిర్మాణ స్థలాలు, ఇటుక క్షేత్రాలు, ఇతర వలస ప్రాంతాల్లోని నివసిస్తున్న ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయటానికి మొబైల్ బృందాలు పనిచేస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కాండ్రు కాశయ్య, అనుముల వెంకట్రాంరెడ్డి మార్కెట్ యార్డు డైరెక్టర్ దుద్దుల యోహాను మైనార్టీ నాయకులు హాసన్ హెల్త్ సూపర్వైజర్ శివుడు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com