Logo
Date of Publish : 21 December 2025, 8:10 pm
Editor : Sake Naresh

పల్స్ పోలియోతో పిల్లల ఆరోగ్యానికి భద్రత : పెంకే జగదీష్

పిఠాపురం, డిసెంబర్ 21, (జనస్వరం) : పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో డ్రాప్స్ కార్యక్రమంలో పాల్గొని 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రెండు చుక్కలు జీవన రక్షణ” అని పేర్కొంటూ, ప్రతి బిడ్డకు పోలియో డ్రాప్స్ తప్పనిసరి అని అన్నారు. పోలియో లేని భారతదేశాన్ని కాపాడేందుకు ప్రభుత్వం, ప్రజలు, తల్లిదండ్రులు అందరూ భాగస్వాములై బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
0 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ ప్రభుత్వం నిర్వహించే పల్స్ పోలియో క్యాంప్ రోజున సమీప కేంద్రానికి తీసుకెళ్లి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. రెండు చుక్కలతోనే శాశ్వత రక్షణ లభిస్తుందని, ఇది పిల్లల ఆరోగ్యమైన భవిష్యత్తుకు బలమైన అడుగు అని అన్నారు.
పోలియో రహిత సమాజ నిర్మాణంలో వైద్య సిబ్బంది, ఆశా సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది చేసిన సేవలను ఆయన ప్రశంసిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిత్రాడ ప్రెసిడెంట్ కొత్తలూరు సునీత, ఎంపీటీసీ దూలపల్లి రత్నం, చిత్రాడ గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ నంద్యాల జాన్, గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్ దేశిరెడ్డి సతీష్, చిత్రాడ వార్డు ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జిలు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com