అనంతపురము, నవంబర్ 29, జనస్వరం : ఆధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా పులికంటి నాగేంద్రనాథరెడ్డిని ఏకగ్రీవంగా నియమిస్తూ ఎపియుడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు శివలు నిర్ణయించారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సుబ్బారావు, శివ, ఐజెయు నేత సోమసుందర్ కు నాగేంద్రనాథరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఉపాధ్యక్షులు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు ప్రత్యేకంగా పులికంటిని అభినందించారు.