త్వరలోనే ప్రతి నియోజకవర్గం లో 2 లేదా 3 రోజుల పాటు తానే స్వయంగా నియోజకవర్గం లో పర్యటిస్తానని హామీ ఇచ్చిన అధ్యక్షులు. గురువారం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు కార్యాచరణ మరియు పలు ముఖ్యమైన విషయాలపైన చర్చించడానికి తిరుపతి కి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరు నియోజకవర్గం నుండి జనసేన నాయకులు మరియు జనసైనికులు పెద్దఎత్తున పాల్గొనడం గమనార్హం. ఇందులో భాగంగా పలమనేరు నియోజకవర్గం తరుపున పూల చైతన్య మెహన్ గారు నియోజకవర్గ పరిధిలో రైతులు పడుతున్న సమస్యలు మరియు ప్రభుత్వం ప్రజలపై చూపుతున్న మొండి వైఖరిని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు త్వరలో పలమనేరు నియోజకవర్గం పర్యటిస్తారు, అయన ప్రకటించిన భవిష్యత్ కార్యాచరణపై మీడియా సమావేశంలో తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగరాజు,దిలీప్ పసుపులేటి,అనిల్,రమేష్,సుబ్ర మణ్యం, టైలర్ రాజు, చందు, విష్ణు ప్రసాద్ రెడ్డి, జనార్ధన్,సునీల్, వెంకటరమణ, చైతన్య(నాని), హరీష్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.