Logo
Date of Publish : 25 April 2021, 2:30 am
Editor : Sake Naresh

శ్రీ పవన్ కళ్యాణ్ గారు కరోన నుండి త్వరగా కోలుకోవాలని జగ్గయ్యపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో పూజలు

                కొన్ని కోట్ల హృదయాల గుండె చప్పుడు, జనం మనిషి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కరోన నుండి త్వరగా కోలుకోవాలని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక చెరువు కట్ట నందు గల ఆంజనేయ స్వామి గుడిలో ఆయన గోత్ర నామాల పేరుతో ఆకు పూజ నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 3 వ తారీఖున తిరుపతి లో జరిగిన పాదయాత్ర, బహిరంగ సభల్లో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్న ఆయన కొంత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచనలు మేరకు కోవిడ్ పరీక్ష చేయించుకున్నారని ఫలితాలు నెగటివ్ వచ్చినప్పటికీ ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే క్వారంటైన్ కు వెళ్లారు అని, అయినప్పటికీ జ్వరం, వొళ్ళు నొప్పులు రావటంతో రెండు రోజుల క్రితం కోవిడ్ పరీక్షలు చేపిచ్చుకోగా పాజిటివ్ గా ఫలితం వచ్చింది అని ఆయన తెలిపారు. ఉపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటీ వైరల్ మందులతో డాక్టర్లు చికిత్స చేస్తున్నారని ఎప్పటిక్కప్పుడు శ్రీ చిరంజీవి గారు శ్రీమతి సురేఖ గారి శ్రీ రాంచరణ్ గారు శ్రీమతి ఉపాసన గారు కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన తెలిపారు. కోవిడ్ ని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలో ఆయన ప్రారంభించిన యజ్ఞాన్ని కొనసాగిస్తారని మనలో తిరుగుతారని అభిమానులు గుండె ధైర్యంగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగ, శివ, గోపి, శ్రీకాంత్, శివ గోపి, రాం తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com