Logo
Date of Publish : 06 July 2023, 4:19 pm
Editor : Sake Naresh

ప్రజా క్షేమమే పవన్ కళ్యాణ్ అభిమత౦ : కందుల నాగరాజు

       విశాఖపట్నం ( జనస్వరం ) : పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో డాక్టర్ కందుల వెల్లడి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 71వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు వార్డులలో పర్యటించారు. జనసేన అధికారంలోకి వస్తే చేసే మంచి పనులను, సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజా క్షేమమే పవన్ కళ్యాణ్ అభిమతమని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాలకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి తాను జనంలోకి వెళ్తున్నట్లు చెప్పారు. ప్రజలు అధికార మార్పు కోసం ఎదురుచూస్తున్నారని, వచ్చే ఎన్నికల తర్వాత వైసిపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసే ప్రతి చోట మెజార్టీ ఓట్లతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకోవడం వల్ల వచ్చే ఎన్నికలలో భారీ మార్పు సంభవిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు జనసేన వెంట ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లుక్స్ గణేష్, ప్రసాద్, బద్రి, గాజుల శ్రీను, హరీష్, అశోక్, వర, సునీత, మంగ, కుమారి, జనసేన యువనాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com