తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి పేదప్రజల ప్రాణారక్షణ కోసం మెగాస్టార్ చిరంజీవి మరోసారి తమ సేవాగుణాన్ని చాటుకున్నారని ఎమ్మిగనూరు మెగా ఫ్యాన్స్ సేవాసమితి తాలూకా అధ్యక్షులు., జనసేన నాయకులు రాహుల్ సాగర్ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఆయా జిల్లాలకు చెందిన చిరంజీవి అభిమాన సంఘాల అద్యక్షులకు ప్రాణవాయువు బ్యాంకుల నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలనే నిర్ణయంతో అభిమాన సంఘాల నాయకులు విపత్కర పరిస్థితుల్లో సేవాచేసే అవకాశం అదృష్టం కల్పించారని అన్నారు. కరోనా మహమ్మారి బారినపడి ఆక్సిజన్ అందక అల్లాడిపోతున్న ప్రజలకు ఆపన్నహస్తం అందిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఆ రక్తనిధి కేంద్రం ద్వారా ఇప్పటికీ అవసరమైన రోగులకు రక్తాన్ని అందిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని అదేవిధంగానే ఇటీవల కరోనా మరణాలు కదిలించి ప్రాణవాయువు బ్యాంకులను నెలకొల్పేందుకు ముందుకు రావడం మహానుభావుడు చీరంజీవికే సాధ్యమన్నారు. రక్తదానం మరియు నేత్రదానం లాంటి బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితిలో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకై నేనున్నానంటూ గతంలో కోట్ల మందికి రక్తం పంచి రక్తదాతగా మారి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణవాయువును పంచి ప్రాణదాత అవుతూ ఎందరో కుటుంబాలకు వెలుగును ఇస్తున్నా మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి మంచి కార్యక్రమాలు కొనసాగించి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆపన్న హస్తాన్ని అందించి ఆదుకోవాలని కోరారు.
వీటిని కూడా చదవండి :
సీఎం భజన చేయడానికి అసెంబ్లీ సమావేశమా ? : జనసేన నాయకులు, లాయర్ జయరాం రెడ్డి
భవన నిర్మాణ కార్మికులకు, రోజూ వారి కూలీలకు ప్రభుత్వం భరోసా కల్పించాలి : జనసేన నాయకుడు అక్కల గాంధీ మోహనరావు
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి : జనసేన PAC సభ్యులు చిలకం మధుసూధన్ రెడ్డి
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here