మడకశిర, (జనస్వరం) : మడకశిర నియోజకవర్గంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడంపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గ్రామాల్లో వీధిలైట్లు విద్యుత్ సమస్య కొరత, తాగునీటి సమస్య, పేద ప్రజలు ఇల్లు లేని పరిస్థితిలో సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక అందుబాటులో లేక తీవ్ర సమస్యలు, విద్యార్థులకు మరియు మారు మూల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్సు సౌకర్యాల కొరత, మహిళలకు సామాన్య ప్రజలకు మద్యపానం నుంచి వచ్చే ఇబ్బందులు, రైతులకు పంట రుణాలసమస్యలు, నియోజకవర్గ అన్ని మండల పరిధిలో రోడ్ల సమస్యలు, గ్రామవీధుల్లో రోడ్డు సమస్యలు, ఉపాధి హామీ పనులకు బిల్లుల సమస్యలు, బ్యాంకు రెన్యువల్ రుణాలకు సంబంధించిన సమస్యలు, గ్రామ సచివాలయ సమస్యలు, తాసిల్దార్ కార్యాలయం సమస్యలు, పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సమస్యలు, బ్యాంక్ సంబంధించిన సమస్యలు, సామాన్య ప్రజలకు పెట్రోల్ డీజిల్ ధరల సమస్యలు, సామాన్య ప్రజలు అన్ని ప్రభుత్వ సంస్థల్లో ఎదుర్కొంటున్న సమస్యలు గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య, మరియు బస్ స్టాప్ సమస్యలు, మరుగుదొడ్డి సమస్యలు, గ్రామాల్లో తీవ్రమైన డ్రైనేజీ సమస్యలు, మౌలిక సదుపాయాలు నిత్యవసర సరుకులు తీవ్రంగా రేట్లు పెరగడం వలన ప్రజలు ఇబ్బంది పడే సమస్యలు, వీటన్నిటికీ పరిష్కార మార్గాన్ని అవకాశం చేయాలని సమాజ అభివృద్ధికి దోహదం కావాలని దేశ పురోభివృద్ధికి కృషి చేయాలని, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులతో మీడియా సమక్షంలోప్రజా వేదిక ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరఫున తహశీల్దార్ ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మడకశిర మండలం అధ్యక్షుడు T.A శివాజీ. T. ప్రసాద్ ఉపాధ్యక్షుడు, నాగార్జున సంయుక్త కార్యదర్శి మోహన్ పాల్గొనడం జరిగింది.