అరుకు ( జనస్వరం ) : నియోజకవర్గం మాదల పంచాయతీ పరిధిలో గల నంది వలస గ్రామం మోడల్ కాలనీ వీధిలో ప్రభుత్వం తక్షణమే పిటిజీలకు అంత్యోదయ కార్డు కల్పించాలని జనసేన పార్టీ మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా, అల్లంగి రామకృష్ణ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఆయా గ్రామంలో విద్యుత్ స్తంభాలు ప్రభుత్వం వేయకపోవడం వల్ల విద్యుత్ లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం నందివలస మోడల్ కాలనీ వీధిలో విద్యుత్ స్తంభాలు కల్పించి మెరుగైన యుద్ధ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గిరిజనులు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగానే జనసేన మాటలు జనసేన సిద్ధాంతాలు గిరిజనులకు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మహేష్. చిరంజీవి గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com