మదనపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి నొక్కని బటర్ల గురించి పోలవరం, రాజధాని గురించి మాట్లాడుతుంటే మన చేతగాని ముఖ్యమంత్రి పదేపదే పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు పెళ్ళాల గురించి మాట్లాడటం అతని చేతకానితనాన్ని సూచిస్తుందని జనసేన పార్టీ నాయకులు మైఫోర్స్ మహేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు పెళ్లిళ్ల బ్రోకర్ అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి 4.5 సంవత్సరం అవుతున్న మళ్లీ ఎన్నికల సమయం వచ్చినా ఇప్పటికీ 2021 నుంచి పోలవరం పూర్తి చేస్తామని కాలయాపన చేస్తున్న జగన్మోహన్రెడ్డి నాలుగున్నర సంవత్సరంలో రాజధాని నిర్మించలేని అసమర్ధ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. తన పాలనలో వాలంటీర్ నుంచి, సచివాలయం నుంచి ప్రతి వ్యవస్థ అవినీతి వయం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆగ్రహ వేషాలకు భయపడి పరదాలు చాటున రాణిల దాక్కుని తిరిగే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం పైన ఆయన పెళ్లిళ్లు పెళ్ళాలు పైన మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా పెళ్లిళ్ల బ్రోకర్ల వ్యవహరిస్తున్నాడని, జనసేన పార్టీ తరఫున ప్రజలను ఒకటి కోరుకుంటున్నాం అని అన్నారు. ప్రజల బాగోగులు రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రతినిత్యం వ్యక్తిగత దూషణలు చేసే ఇలాంటి వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి వచ్చి ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి జగన్ మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పే రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి కూటమిని గెలిపించాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సందీప్ రెడ్డి, శ్రీనాథ్, వీర మహిళ నాయకురాలు సునీత, జనసేన పార్టీ నాయకులు అప్సర్, శమీ, దేవేంద్ర, పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com