
ఏలూరు ( జనస్వరం ) : అరాచక వైసిపి ప్రభుత్వానికి పాడి కట్టి సమాధికి, గాలి సీఎం జగన్ జైలుకి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు హెచ్చరించారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పేరు వింటేనే సైకో జగన్ రెడ్డికి చలి జ్వరం వస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి అరాచకాలు, విధ్వంసాలు, అక్రమాలకు పాల్పడుతూ పాలన చేస్తున్న జగన్ రెడ్డి సీఎం అని చెప్పుకునేందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని అపహాస్యం చేశారు. ప్రభుత్వం డబ్బుతో సభలు పెట్టి చేసిన సంక్షేమం, అభివృద్ధి కోసం చెప్పుకోవలసిన జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా వివాహాలు చేసుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సైకో జగన్ రెడ్డికి హితవుపలికారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కరువైందని, మహిళలపై రోజురోజుకు అగత్యాలు, అత్యాచారాలు, హత్యలు, అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే విధంగా జగన్ రెడ్డితోపాటు అతని మంత్రివర్గ సభ్యులు కూడా మాట్లాడుతున్నారన్నారు. జగన్ రెడ్డికి కూడా తల్లి, చెల్లి, భార్య ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రోడ్లమీద నడవకుండా, రోడ్లమీద తిరగకుండా గాలిలో తిరిగే గాలి సీఎం జగన్ గాలి మాటలతో కాలం గడుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నియంతలా వ్యవహరిస్తూ నిత్యం అబద్దాలు వల్లిస్తూ, హింసలకు పాల్పడుతూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించారు. పరిపాలన చేతకాని, నికృష్టమైన, మానసిక స్థితులేని జగన్ రెడ్డి ప్రభుత్వానికి గోరి కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, 2024లో జరిగే ఎన్నికల్లో వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా రాదని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు.
2019 ఎన్నికల్లో అబద్ధాలు చెబుతూ ఒక్క ఛాన్స్ అంటూ ప్రాధేయపడితే జగన్ కు ఓట్లు వేసి ప్రజలు మోసపోయారన్నారు. రాష్ట్ర ఖజానా కాపాడాలని, మంచి పాలన జరగాలని, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం, రైతుల మేలు కోసం పవన్ కళ్యాణ్ అరాచక సైకో జగన్ రెడ్డి ప్రభుత్వం పై పోరాడుతున్నారని తెలిపారు. 30 లక్షల ఇల్లు కట్టిస్తానని చెప్పిన జగన్ ఇల్లు నిర్మించకుండా మోసపూరిత మాటలతో రెడ్డి లబ్ధిదారులను అప్పులు ఊపులోకి నెట్టివేశారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో అక్కడి ప్రజలను దగా చేసేందుకే జగన్ రెడ్డి విశాఖ రాజధాని అంటున్నాడని, అక్కడ వనరులను లూటీ చేసేందు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ పేరెతే అర్హత సైకో జగన్ రెడ్డికి గాని, మంత్రులకు గాని, వైకాపా నాయకులకు గానీ లేదన్నారు. మరోసారి పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు సిరిపల్లి ప్రసాద్ మాట్లాడుతూ బుద్ధి చెప్పినా, గడ్డి పెట్టినా జగన్ రెడ్డికి సంస్కారం రావడం లేదన్నారు. తండ్రి మరణించినప్పుడు బెంగళూరు ప్యాలెస్ లో రాసలీలల్లో జగన్ రెడ్డి ఉన్నాడని వచ్చిన ఆరోపణలు నిజమేనా అని నిలదీశారు. నీలాంటి వాడి వద్ద నీలాంటి బుద్ది ఉన్నవారే చేరుతారన్నారు. ఋషి కొండను ధ్వంసం చేసి కోట్లాది రూపాయల ప్రజాధనంతో జగన్ రెడ్డి విలాసవంతమైన భవనాలు నిర్మించుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, పాడికట్టి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబ్బిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శులు బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, కోశాధికారి పైడి లక్ష్మణరావు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జనసేన రవి,చిత్తిరి శివ తదితరులు పాల్గొన్నారు.