పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం ఆధునిక పట్టణంగా తయారు చెయ్యాలనే దృఢసంకల్పంతో జనసేన ఇంచార్జ్ ఉదయ్ ఉన్నారు. జనసేన గెలుపుతో పిఠాపురం పేదరికం నిర్మూలన చేస్తారని పి.ఎస్. ఎన్. మూర్తి టీమ్ అన్నారు. వారు మాట్లాడుతూ అలుపు ఎరగని సేవ పార్టీకి ఎంతో తోడ్పడుతుందని అన్నారు. పిఠాపురం 14 వ వార్డులో పర్యటన వీరబాబు ఆధ్వర్యంలో పి. ఎస్. ఎన్. మూర్తీ టీమ్ 30 మందికి నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, కర్రి కాశీ, పెంకే జగదీష్, కోలా దుర్గాదేవి, నామ శ్రీకాంత్, వేణం సత్యం, వేణం త్రిమూర్తులు, వేణం సురేష్, జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.