మదనపల్లి ( జనస్వరం ) : దశాబ్దాలుగా మారుమూల ప్రాంతంలోని గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయనడానికి పోతబోలు పంచాయతీలోని గ్రామాలే ఉదాహరణ అని జనసేన పార్టీ నాయకులు మైఫోర్స్ మహేష్ అన్నారు. మదనపల్లె రూరల్ మండలం పోతబోలు పంచాయతీ పరిధిలోని కొంకివారిపల్లి, వలసమూల, మల్లయ్యగారిపల్లి, బయన్నగారిఇండ్లు రోడ్డు సౌకర్యం కల్పించాలని పంచాయతీ రాజ్ ఈఈ చంద్రశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేసినారు. ఈ సందర్భంగా నేటికి రహదారి లేని గ్రామాలు వున్నాయనే విషయాన్ని గుర్తించాలని పంచాయతీ రాజ్ ఈఈకి విన్నవించారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ 30 రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులలో ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు వివరించి, రోడ్డు సౌకర్యానికి మీ వంతు సహకారం అందించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కనీస సౌకర్యాలలో ఒకటైన రోడ్డు సదుపాయం కోసం అధికారులు, పాలకుల చూట్టూ తిరుగుతున్న పట్టించుకోలేదని గ్రామస్థులు తాము చేపట్టిన జనం కోసమే జనసేన కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు తమ దృష్టికి తెచ్చారని వివరించారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ మురళీ కి వినతిపత్రం అందించమని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతాల దుస్థితిని పాలకులు పట్టించుకోకుండా వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నాలుగు గ్రామాలకు రోడ్డు సాధించే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని ప్రకటించారు. అందులో భాగంగా నెల రోజులలో రోడ్డు పనులు ప్రారంబించాలని పంచాయతీ రాజ్ ఈఈని కోరామని, లేని పక్షంలో గ్రామస్థులతో కలిసి నిరాహారదీక్ష చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అమరనారాయణ, మల్లిక, సిద్దయ్య, శోభ, రూపా పాల్గొన్నారు.