Logo
Date of Publish : 24 November 2020, 4:21 pm
Editor : Sake Naresh

శుద్ది చేసిన నీటిని అందించండి – స్పందనలో జనసేన ఫిర్యాదు

శుద్ది చేసిన నీటిని అందించండి - స్పందనలో జనసేన ఫిర్యాదు

          ఆకీవీడు మండలం పెదకాపవరం గ్రామంలో గల ఆర్‌.డబ్యుఎస్‌ స్కీము ద్వారా రక్షిత మంచినీరు గ్రామంలో సరఫరా చేయబడుచున్నది. సదరు స్కీము ఫిల్దర్‌ బెడ్‌ లో ఇసుక మార్చి చాలాకాలము అయినందున నీరు పిల్టర్‌ అవ్వకుండా నేరుగా ప్రజలకు సరఫరా కాబడుచున్నది. అందువల్ల ప్రజలు సదరు మురుగు నీరు త్రాగలేక చాలా బాధపడుచున్నారు. అలాగే కలుషిత నీరు త్రాగుట వల్ల ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురగుచున్నవి. ఈ ఫిల్టర్‌ బెడ్‌లలో ఇసుక మార్చించి ప్రజలకు స్వచ్చమైన త్రాగునీరు అందించవలసినదిగా అనేకసార్లు అధికారులకు విన్నవించుకొనియున్నాము అని జనసైనికులు, వీర మహిళలు అన్నారు. కాని ఇప్పటివరకు అధికారులు తగు చర్యలు తీసుకొనుట లేదని అన్నారు. అధికారుల అలసత్వం వల్ల గ్రామంలో ప్రజలకు అనారోగ్య సమస్యలు తీవ్రమగుచున్నవి. అదేవిధంగా పెదకాపవరం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఏటిగట్టు, గొల్లగూదెం ప్రాంతాల వారికి పైపుల ద్వారా నీరు సక్రమముగా సరఫరా అగుట లేదు. ఈ ప్రాంతాలకు నీరు సక్రమముగా అందించలేక పోవుట వల్ల, ప్రజలు త్రాగునీరు దొరకక ఇబ్బందిపడుచున్నారు. కావున పెదకాపవరం గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆర్‌. డబ్యుఎస్‌. స్కీము. పిల్టర్‌ బెడ్‌ లో ఇసుక మార్పు చేయించి ప్రజలకు మంచినీరు అందించవలసినదిగా, ఏటిగట్టు గొల్లగూడెం ప్రాంతాలకు పూర్తిస్థాయిలో మంచినీరు సరఫరా చేయించుటకు తగు చర్యలు తీసుకొనవలసినదిగా కోరుచున్నాము అని జనసైనికులు మరియు వీరమహిళలు అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com