
వీరఘట్టం, (జనస్వరం) : గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 20వ రోజు పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గ, వీరఘట్టం మండలం వంకాయల గెడ్డ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన పెద్దలు మాట్లాడుతూ వీది లైట్లు లేవు, గ్రామానికి సరైన రహదారి లేదు, తాగునీరు సమస్య, పిల్లలు పాఠశాలకి వెళ్లాలంటే సమస్య, సంక్షేమ పథకాలు సరిగ్గ అమలు చేయడం లేదు గిరిజన కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు లేవు అని వీరఘట్టం జనసేన పార్టీ నాయకులకు తెలిపారు. మత్స పుండరీకం మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హులైన ప్రజలకు ఏడాదికి 50 వేల, లక్ష ఇస్తే ప్రజల జీవితాలు బాగుపడ్డాయ? అల ఐతే ఆంధ్రప్రదేశ్ లో పేదరికం ఎందుకు ఉంటుందని వ్యాఖ్యానించారు. మూడేళ్ల జగన్ ప్రభుత్వం 1.17 లక్షల కోట్లు మహిళలకు పంచి పెట్టమని చెపుతున్నారన్నారు. ప్రతి ఏడాది ఈ పథకం పేరుతో ఇస్తున్నారు ఇంకా ఆశగా చూస్తున్నారంటే దాని అర్ధం ఎమిటి అని ప్రశ్నించారు. ఈ డబ్బుతో వారి జీవితాల్లో ఎటువంటి మార్పు లేదని అన్నారు. గాజువాక, భీమవరం లలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టరు. మరి నేడు అన్ని గ్రామ పంచాయతీలలో వీధి దీపాలు వెలగడం లేదు, కాలువలు, వీధులు అపరిశుభ్రంగా ఉన్నాయి, నియోజికవర్గo అభివృద్ధి నిధులు ఏమి అయ్యాయని ప్రశ్నించారు? జనసేన జాని మాట్లాడుతూ 1వ తరగతి నుండి పిజి వరకు ఉచిత విద్య, ఉచిత గ్యాస్, రేషన్ కి బదులు 2500 నుండి 3500 వరకు నగదు బదిలీ పథకం, గిట్టుబాటు ధరలు, రైతులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తారు అని గిరిజన పెద్దలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కర్ణేన సాయి పవన్, దత్తి గోపాలకృష్ణ, బొమ్మలి వినోద్, సొండి సుమన్, దూసి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.