సర్వేపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం గ్రామాన్ని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సందర్శించారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జనసేన పార్టీ తరఫున ఒకటే అడుగుతున్నాం. భారీ తుఫాన్ కారణంగా తిరుమలమ్మపాలెం గ్రామం చుట్టూ వరదనీటితో రాకపోకలు ఆగిపోయి. రైతులు వేసుకున్న పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. మూగజీవాలు కొన్ని మరణించడం కూడా జరిగింది. ఐదు రోజులపాటు గ్రామస్తులు తినడానికి తిండి కూడా ఎంతో ఇబ్బందులు పడితే వాళ్లకి తుఫాన్ నష్టానికి సంబంధించి ఆర్థిక సహాయం ఎందుకు అందించలేదు. ఆ గ్రామస్తులు అందర్నీ కూడా వాళ్ళ సమస్యలని అడిగి ఎందుకు తెలుసుకోలేదు. మాకు అయితే తెలియట్లేదు ఎన్నికల సమయంలో తిరుమలమ్మపాలెం గ్రామస్తుల ఓట్లు కావాలి. కానీ ఓదార్లు వచ్చి గ్రామం చుట్టూ నీళ్లు నిండిపోతే రాకపోకలు నిలిచిపోతే మాత్రం ఈ మంత్రికి పట్టదు. ఈ మంత్రి గారికి ఇంకా 90 రోజులు ఎక్కడవు కనీసం ఇకనైనా స్పందించి గ్రామస్తులు తుఫాన్ కారణంగా నష్టపోయిన కౌలు రైతులకి పట్టాలు లేని భూములు కలిగిన రైతులకి కావచ్చు పశువులను కోల్పోయిన కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వీర మహిళ గుమ్మినేని వాణి భవాని, మండల కార్యదర్శి శ్రీహరి, వెంకటాచల మండలం నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, ముత్తుకూరు మండలం నాయకులు రహీం, రహమాన్, వంశీ ,తదితరులు పాల్గొన్నారు.