నర్సీపట్నం నియోజకవర్గంలోని ప్రతీ సచివాలయంలో ఆధార్ సేవలు అందేలా చూడాలని జనసేన పార్టీ నర్సీపట్నంనియోజకవర్గ సమన్వయకర్త రాజాన వీరసూర్యచంద్ర డిమాండ్ చేశారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సంక్షేమ పథకాలు తాలూకా ప్రతీ అప్లికేషన్ కూడా ఆధార్ అనుసంధానం చేయడంవలన సంక్షేమ పథకాలు అర్హులకు ఆధార్లో సవరణలకు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయుటకు, ఫోన్ నెంబర్ లింక్ చేయుటకు తప్పనిసరిగాఆధార్ సేవలు కావాలి. నియోజకవర్గంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో ఆధార్ సేవలు అందే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. అంతేకాకుండా ఆధార్ కేంద్రాలు మండల కేంద్రంలో ఉండడం వలన గ్రామాలలో ఉన్న వయోవృద్దులకు, బాలింతలకు, పిల్లలకు ఆధార్సేవలో మార్పులు చేర్పులు చేయాలన్నారు. ఈ కరోనా విపత్కర సమయంలో మండల కేంద్రాలకు వెళ్ళలేని పరిస్థితి ఉందన్నారు. ఈ సమయంలో ఆధార్ సేవలు ప్రతి సచివాలయంలో అందేవిధంగా ఉన్నతాధికారులు చొరవ చూపాలన్నారు. అలాగే ప్రతి పిహెచ్సి లోను కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రతి గ్రామంలో ఉన్న సచివాలయ పరిధిలోగ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న ఆరోగ్య సిబ్బంది ద్వారా ప్రతిరోజుఅందుబాటులోఉండేలా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వూడిచక్రవర్తి, నర్సీపట్నం టౌన్ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్, టౌన్ ప్రధానకార్యదర్శి కొప్పాక కళ్యాణ్, గొంప గణేష్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com