Logo
Date of Publish : 05 May 2022, 3:07 pm
Editor : Sake Naresh

త్రాగు నీటి సదుపాయం కల్పించాలని వనభంగిలో ఖాళీ బిందెలతో నిరసన

      అరకు ( జనస్వరం ) : పెదబయలు మండలం వనభంగిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్థులతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జాగరపు పవన్ కుమార్ మాట్లాడుతూ సుమారు వంద కుటుంబాలకు పైగా జీవిస్తున్న అప్పటికీ గత రెండు సంవత్సరాలుగా త్రాగునీటి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పలుమార్లు ఉన్నత అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎవరు కూడా స్పందించడం లేదన్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చుక్క నీరు కోసం మహిళలంతా కొట్టుకు చస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికైనా తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని లేనిపక్షంలో మండల కేంద్రంలో ఖాళీ బిందెలతో ధర్నా చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రాంబాబు, వీరేశ్ , చేనాపతి రత్నమ్మ, రాణి, అమ్మాజీ, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com