Logo
Date of Publish : 24 December 2022, 4:25 pm
Editor : Sake Naresh

జగన్ తప్పిన 100 మాటలు ప్లకార్డులతో నెల్లూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన

     నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ నెల్లూరు నాయకులు గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంపై నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి మరచిపోయిన జగన్ తప్పిన మాటల 100 ప్ల కార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట తప్పడం మడం తిప్పడం అలవాటైపోయిన జగన్ దాదాపు 100 మాటలు పైగా నిలబెట్టుకోలేకపోయాడు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలి మూడు పెళ్లిళ్ల దగ్గర ఆగిపోయిన అతని కుటుంబంలో, ఎవరెవరికి ఎన్ని పెళ్లిళ్లు జరిగాయో మాకు తెలుసు సంస్కారహీనంగా మాట్లాడటం మా నాయకులకు తెలియదు అందుకే సహనం వహిస్తున్నారని తెలిపారు. ప్రజల మద్దతు లేకుండా ఈసారి 175 అని కలలు కంటున్న మీకు 50 సీట్లు దక్కడం కూడా కష్టమే అని తెలిపారు. ఎన్నికల ముందు అవ్వా,తాతా,అక్కా,అన్నా అంటూ ఊరూరు తిరిగిన జగన్ గెలిచిన తర్వాత ప్రజల్లో కనపడటమే కష్టం అయిపోయింది. ఎక్కువ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెప్పిస్తానన్న జగన్ ఇప్పటికి రాజధాని కూడా ఏర్పరచలేకపోయారు. సంస్కారహీనంగా వ్యక్తిగతంగా దుర్భాషలాడుతున్న జగన్ కి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలన్నా రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా జనసేన పార్టీ గాజుగ్లాసు కి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులకు గునుకుల కిషోర్ తో పాటు కంథర్, హేమంత్, షాజహాన్, ఇంతియాజ్, రాజా, మౌనేష్, బాలు, వర, వెంకీ, వినోద్, శ్రీకాంత్, బన్నీ, శంకర్, మల్లీ తదితరులు పాల్గొన్నారు..


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com