
విశాఖపట్నం, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు, అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా 24వ వార్డు కార్పొరేటర్ అభ్యర్దిని అడబాల లక్ష్మి సమక్షంలో గుర్ ద్వార జంక్షన్ నుండి ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్ కార్యాలయం వరకూ రోడ్లు ఊడుస్తూ నిరసన తెలియచేయడం జరిగింది. అనంతరం సి.ఎం.డి ని కలిసి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షురాలు దుర్గా రెడ్డి, నాయకులు వెంకటేష్, నీరుకొండ దివాకర్, బోడసింగి శ్రీధర్, రంగారావు, సాగర్, ముమ్మిననాగమణి, త్రివేణి, కళ, గారపాటి లక్ష్మి, నూకరాజు, పడాల పరమేష్ పెద్ద ఎత్తున జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.