కార్వేటి నగర్ మండలం ( జనస్వరం ) : కాశి తోట వీధిలో నివాసముంటున్న ఒక నిరుపేద జనసేన మహిళ సెల్వి కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. గతంలో మూడుసార్లు ఇంటి నిర్మాణ మంజూరు పత్రం కొరకు వినతి పత్రం సమర్పించినా స్పందన రాలేదు. ఈ ర్యాలీ బాధితురాలు ఇంటి వద్ద నుండి గాండ్ల మిట్ట మీదుగా కార్వేటినగరం ఎంపీడీఓ సముదాయం వరకు నిర్వహించడం జరిగింది. సమదాయము నుండి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆఫీస్ వద్దకు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న వినూత్న రీతిలో పొర్లుదండాలు పెడుతూ నిరసన తెలియజేశారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు సంబంధిత గృహ నిర్మాణ శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం లోపు గ్రౌండ్ చేయడానికి అన్ని అనుమతులు ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఒకవేళ శుక్రవారం సాయంత్రం లోపు కొలతలు ఇవ్వకపోతే శనివారం ఉదయం నుండి ఆమరణ దీక్ష చేస్తామని డాక్టర్ యుగంధర్ పొన్న తెలిపారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు గృహ నిర్మాణ శాఖ సంబంధిత అధికారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. స్వామి అసమర్ధుడని తెలుస్తోందని, అందుకే ఇంతటి వ్యతిరేకత నియోజకవర్గం లో అలుముకొని ఉన్నదని తెలిపారు. నిరుపేద ప్రజలకు అండగా ఉండి, వారి సమస్యలను పరిష్కరించే వరకు వీరోచితమైన పోరాటం చేయడానికి జనసేన పార్టీ ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వండి, నియోజకవర్గంలో సర్వరంగ సమగ్ర అభివృద్ధిని తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మండల బూత్ కన్వీనర్ అన్నామలై, మండల ప్రధాన కార్యదర్శి దేవేంద్ర, సోమశేఖర్, హరీష్, మండల కార్యదర్శి రూపేష్, నవీన్, టౌన్ కమిటీ ఉపాధ్యక్షురాలు మీనా, ప్రధాన కార్యదర్శి మనీ, సూర్య, కార్యదర్శి మహేంద్ర, జనసైనికులు పాల్గొన్నారు.