అనంతపురం, (జనస్వరం) : కరెంటు చార్జీలు, పెట్రోల్ డీజిల్ చార్జీలు ఇంటి పనులు, బస్సు చార్జీలు, స్కూల్ కాలేజీ ఫీజులు, చివరికి నీటి చెత్త పన్నులు బాదుడే… బాదుడు, బాదుడే… బాదుడు అని గతంలో మీరు చెప్పి… ఇప్పుడు బాదుతున్నారు కదన్నా అని ప్రజలు సూటి సూటిగా ప్రశ్నిస్తున్నారు? అని జయరాం అన్నారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాత్రి 12 గంటల సమయంలో కూడా స్త్రీలు నిర్భయంగా తిరగాలని, తిరుగలేని లేనిపక్షంలో ఎవరైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటారో వారి కనుగుడ్లు పీకాలి అని చెప్పారని, ప్రతి రోజూ రాష్ట్రంలో ఏదో ఒక చోట స్త్రీలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ఇప్పుడు మేము ఎవరి కనుగుడ్లు పీకాలని మహిళలు అడుగుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడేళ్లుగా ప్రత్యేక హోదా గురించి నోరెత్తలేదు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి నేడు సందు సందుకు బ్రాందీ షాపు పెట్టారు. పన్నులు, చార్జీలు పెంచి పేదల కడుపు కొడుతున్నారన్నారు. రైతు సబ్సిడీలను ఎత్తేసి రైతులను మోసం చేస్తున్నారని, పోలవరం 2021 పూర్తి చేస్తామని చెప్పి నేడు చేతులెత్తేశారని, డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం వడ్డీ మాఫీ చేసి డ్వాక్రా మహిళలను మోసం చేశారు. మెగా డీఎస్సీ అన్నావ్ – జాబ్ కాలండర్ అన్నావ్ బిసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు అన్ని నిర్వీర్యం చేశారన్నారు. మైనారిటీలకు ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్ని హామీలు నెరవేర్చారు? పాలన చేతకాక పూటకొక అబద్ధం చెప్తున్నారు. కౌలు రైతుల కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తను చెమటోడ్చి సంపాదించిన సొమ్మును త్యాగం చేసి, ఇప్పటికే దాదాపు 200 మంది కౌలు రైతు కుటుంబాలను ఆదుకున్నాడని, అది చూచి ఓర్చుకోలేక పవన్ కళ్యాణ్ పైన మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత వ్యక్తిగత దూషణలు చేయిస్తూ శునకానందం పొందుతున్నారు. ఇప్పటికైనా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను చిత్తశుద్ధితో ఆదుకొని వారి కుటుంబాలకు మంచి చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.