చంద్రగిరి నియోజకవర్గం ( జనస్వరం ) : పాకాల మండలం, దామలచెరువు పంచాయతీలో వీధి రోడ్డులు, డ్రైనేజీ కాలువలు లేక ప్రజల ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యని తిరుపతి జనవాణి కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాన్ని జనసేన నాయకులు అందించారు. చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, చిత్తూరు జిల్లా కార్యదర్సులు దేవర మనోహర్, ఎం. నాసీర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పాకాల మండల అధ్యక్షులు గురునాథ్ తలారి సూచనల మేరకు దామలచెరువు ప్రతి వీధిలో రోడ్డు లేని చోట సిమెంట్ రోడ్డులు, డ్రైనేజీ కాలువలు లేని చోట డ్రైనేజీ కాలువలు నిర్మించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. దామలచెరువు పంచాయతీ కార్యదర్శి ఢిల్లీ బాబు గారికి స్థానికులతో పాటుగా వినతి పత్రాన్ని అందించడం జరిగింది. 10300 మంది జనాభా కలిగిన దామలచెరువు పంచాయతీలో డ్రైనేజీ కాలువలు లేక ఇంటి ముందర గుంటలు తీసి ఇంటి నుండి వెలువడే వ్యర్తాన్ని నిల్వ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని వలన పిల్లలు, వృద్ధులు తీవ్ర అనారోగ్యల బారిన పడుతున్నారు. డ్రైనేజీ కాలువలే నిర్మించలేని ఈ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తాం అనడం సిగ్గుచేటు. వీధి రోడ్డులు వీధి దీపలే సరిగ్గా నిర్మించలేని ఈ ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమం లో పాకాల మండల ఉపాధ్యక్షులు దినేష్, చంద్రగిరి వీరమహిళ ఆషా, జనసేన నాయకులు షాజహాన్, చందభాషా, మస్తాన్, హరి, అసిఫ్ స్థానికులు పాల్గొన్నారు.