Logo
Date of Publish : 18 November 2023, 9:15 pm
Editor : Sake Naresh

జనసేన – టీడీపీ ఆధ్వర్యంలో గుంతల రోడ్లు పై పడవలు వదిలి నిరసన

    శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయం అయిన రోడ్లు గురించి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జగన్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలకి తెలిసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారి ఆధ్వర్యంలో జనసేన - టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, దక్షణ కైలాసగిరి కాలనీ, తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామాల్లో పర్యటించి గుంతలమయం అయిన రోడ్డులో పడవలు వదిలి నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్ల చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హాష్ టాగ్ #GunthalaRajyamAP #WhyAPHatesJagan పేరుతో ప్రచురించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4.5 సం.|| తట్టెడు మట్టి వెయ్యలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడుతాడా , కొత్త రోడ్లు వెయ్యలేదు ,కనీసం గుంతలకి మట్టి కూడా వెయ్యలేని దయనీయ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. గుంతలమయం అయిన రోడ్డు లో ప్రజల ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా వాహన దారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 5 నెలల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని రోడ్లు బాగు చేసి, అవసరం అయిన దగ్గర కొత్త రోడ్లు వేస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, నాయకులు పేట చంద్ర శేఖర్, రవి కుమార్ రెడ్డి, పేట చిరంజీవి, లక్ష్మి, దినేష్, కవిత, గురవయ్య, జ్యోతి రామ్, రాజేష్, సురేష్, జనసైనికులు శివ, హేమంత్, తులసీ రామ్, గోపి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com